Sri Lankan President Gotabaya Rajapaksa Flees Country Military Aircraft | మాల్దీవులకు వెళ్లినగొటబాయ

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by
87 Views
తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహంతో ఈనెల 9న అధికారిక నివాసం వీడిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స........ ఈ తెల్లవారుజామున దేశం విడిచి పారిపోయారు. అధ్యక్షుడు, ఆయన భార్య, ఇద్దరు అంగరక్షకులు శ్రీలంక వైమానిక దళానికి చెందిన విమానంలో మాల్దీవుల రాజధాని మాలె వెళ్లారని.. ఇమ్మిగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. గత శనివారం అధ్యక్ష భవనంపై దాడికి ముందు గొటబాయ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందు ప్రకటించినట్టుగానే... గొటబాయ బుధవారం రాజీనామా చేస్తారని శ్రీలంక ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఐతే.............. తాను, తన కుటుంబసభ్యులు సురక్షితంగా దేశం విడిచి వెళ్లేందుకు అనుమతిస్తేనే.......... పదవి నుంచి వైదొలుగుతానన్న హామీకి కట్టుబడి ఉంటానని........... మంగళవారం కొత్త షరతు తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం మాల్దీవులకు వెళ్లినందున.... అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. రాజపక్స రాజీనామా సమర్పించగానే...... అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Category
MILITARY
Commenting disabled.